Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ బంధానికి అడ్డున్నాడనీ.. మటన్ పేరుతో భర్తను హత్య చేయించిన భార్య...

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (12:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. గతంలో నాగర్ కర్నూలులో ఓ మహిళ కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించిన విషయంతెల్సిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో హత్య జరిగింది. భర్తను మటన తీసుకుని రమ్మని బయటకు పంపిన భార్య.. తన ప్రియుడుని పురిగొల్పి హత్య చేయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని రేగడితండా, మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్, శాంతి అనే దంపతులు ఉన్నారు. వీరికి పిల్లలులేరు. ఈ క్రమంలో శాంతికి అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర పరిచయం ఏర్పడింది. ఇది భర్తకు తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన శాంతి... తన ప్రియుడితో తలిసి ప్లాన్ వేసింది. 
 
అందులో భాగంగా గత నెల 21న రేగడితండాలోని తన తల్లి ఇంటికి వెళ్లి మటన్ తీసుకురావాల్సిందిగా భర్తను పంపింది. భార్య పన్నాగం తెలియని నవీన్ స్కూటీపై రేగడితండా బయలుదేరాడు. దారిలో కాపుకాసిన శాంతి ప్రియుడు వెంకటేశ్, అతడి స్నేహితుడు పద్దం నవీన్‌లు నవీన్‌పై దాడిచేసి, ఇనుప రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు స్కూటీని అతడిపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు. 
 
అయితే, తన వదిన శాంతి వ్యవహారం తెలిసిన నవీన్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి సేకరించిన మద్యం సీసాలపై ఉన్న బార్‌కోడ్, సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments