Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ షాపులను కేసీఆర్ సర్కారు రద్దు చేస్తుందా? డీలర్ల అవినీతి చెక్ పెట్టేందుకేనా?

రేషన్ షాపులను తెలంగాణలోని కేసీఆర్ సర్కారు రద్దు చేయనుందని సమాచారం. రేషన్ షాపులను రద్దు చేసి వాటి స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో రేషన

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (11:42 IST)
రేషన్ షాపులను తెలంగాణలోని కేసీఆర్ సర్కారు రద్దు చేయనుందని సమాచారం. రేషన్ షాపులను రద్దు చేసి వాటి స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో రేషన్ షాపుల రద్దు వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. 
 
శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరుగనున్నట్లు సమాచారం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జరుగుతున్న అక్రమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం లబ్ధి దారులకు నేరుగా నగదు అందించే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
 
నగదు నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల సర్కారుపై చెడ్డపేరు తొలగిపోతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ.25 భారం భరిస్తోంది. రేషన్ షాపులు రద్దు చేస్తే, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి రూ.150 చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంత మందికీ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పర్యవసానంగా కాస్త, అటూ ఇటుగా ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల వరకు అందే అవకాశం ఉంది.
 
ప్రభుత్వ నిర్ణయం వల్ల డీలర్ల అవినీతికి చెక్ పడడంతోపాటు లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చిన బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. నగదు నేరుగా అందించడం వల్ల రేషన్ షాపుల ముందు పడిగాపులు కాసే అవస్థ తప్పుతుందని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments