Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం... కేబినెట్ ఆమోదం

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (09:14 IST)
తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధాన అమలుకు కేబినెట్ ఆమెదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. ఇదేవిధంగా వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇసుక తవ్వకం విధానం, సాంస్కృతిక సారథిలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
ఇదేవిధంగా రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు (ఆర్‌అండ్‌బీ), రూరల్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు (పంచాయతీరాజ్‌), నెడ్‌క్యాప్‌ ద్వారా రైతులకు సోలార్‌ పంపు సెట్ల పంపిణీ, మహిళా భద్రత, మార్కెట్‌ కమిటీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ పటిష్ఠం, సర్పంచిలకు మరిన్ని అధికారాలు, గర్భిణిలకు పౌష్టికాహారం పెంపు తదితర అంశాలకు చెందిన ముసాయిదా బిల్లులు వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
కాగా హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కెసిఆర్ మురుగు కాల్వల మళ్లింపునకు వంద కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.100 కోట్ల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments