Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి.. మోదీ చీటి చూసి చదివారు: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ నేత ఏపీ ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఏపీ రాజకీయ పార్టీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (17:29 IST)
తెలంగాణ బీజేపీ నేత ఏపీ ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఏపీ రాజకీయ పార్టీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి ఏర్పడుతుందని కిషన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇచ్చిన క్ష‌ణ‌మే మ‌మ‌తా బెన‌ర్జీ - నితిష్ కుమార్‌లు ఎన్డీఏ నుంచి విడిపోతారని చెప్పారు. 
 
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే హక్కు పార్టీలకు ఉందని, తీర్మానంపై జరిగే చర్చలో అన్ని విషయాలు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా వుందని చెప్పుకొచ్చారు. ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ఎవరో ఇచ్చిన చీటీ చూసి అన్నారు. ప్రత్యేక హోదాపై మోదీకి అప్పట్లో సరైన అవగాహన లేదన్నారు. 
 
ప్రస్తుతానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి నెలకొంటుంది. అందుకే స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ నిధులు కేటాయించారని, ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments