Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు ఎన్నికలు.. అమావాస్య రోజు.. కేసీఆర్‌కు కలిసొస్తుందా?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో.. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (10:23 IST)
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో.. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే డిసెంబర్ 11వ తేదీ తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా.. కొత్త చర్చ తెరపైకి వచ్చింది.


ఇప్పటికే తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ ఎక్కువ. అలాంటిది డిసెంబర్ ఏడో తేదీ అమావాస్య రానుండటంతో.. ఆ రోజు ఆయనకు కలిసి వస్తుందా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతేగాకుండా కేసీఆర్ పక్కా లెక్క ప్రకారం అసెంబ్లీని రద్దు చేశారని అందరూ అనుకుంటున్నారు. సెప్టెంబర్ 6నే అంటే నిర్ణీత కాలపరిమితి కంటే 8 నెలల 26 రోజుల ముందే అసెంబ్లీని రద్దు చేశారు.

అత్యంత బలమైన గురుపుష్య యోగం.. అమృతసిద్ధి యోగం.. కేసీఆర్‌ అదృష్ట సంఖ్య 6.. ఇలా అన్నివిధాలా ఆలోచించాకే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్‌ ముహూర్తం ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 
 
ఇటీవల అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇదే సెంటిమెంటే  వర్కౌట్ అయ్యింది. అయితే తాజాగా ముందస్తు ఎన్నికల షెడ్యూల్ మాత్రం కేసీఆర్‌కు కలిసిరాదని టాక్ వస్తోంది.

అలాగే ఫలితాలు వెల్లడయ్యే డిసెంబర్ 11 కూడా కేసీఆర్‌కు అనుకూలంగా లేదని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ ఎన్నికలు కేసీఆర్‌కు ఏ మేరకు కలిసి వస్తాయనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments