Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను నిరాకరించిందని.. అసభ్య వీడియోలో మార్ఫింగ్‌.. యువకుడి అరెస్టు

ప్రేమోన్మాథులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా ఓ యువతి ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ యువతి ఫోటోలను ఓ యువకుడు మార్ఫింగ్ చేసి నెట్‌లో అప్ చేశాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ వివరాల

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (06:05 IST)
ప్రేమోన్మాథులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా ఓ యువతి ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ యువతి ఫోటోలను ఓ యువకుడు మార్ఫింగ్ చేసి నెట్‌లో అప్ చేశాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన మాదివాడ మురారి(23) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీనలో ఉద్యోగం చేస్తున్నాడు. విజయవాడ భవానీపురం స్టేషన్ పరిధిలోని గొల్లపూడికి చెందిన యువతి.. మురారి పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తోంది. 
 
దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న మురారి... ఆ యువతిని ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. దీనికి ఆ యువతి నిరాకరించింది. దీంతో అసభ్య చిత్రాలను ఆ యువతి ఫొటోలతో మార్ఫింగ్‌ చేసి వాటిని యువతి ఫోన్ నెంబరుతో సహా నెట్‌లో పెట్టేశాడు. 
 
ఈ ఫోన్ నంబరుకు పలువురు విటులు ఫోన్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు మురారీని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments