Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంపు ప్రాంతాల్లో టిడిపి బృందం పర్యటన

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:10 IST)
తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. స్థానిక నేతలతో కలిసి ఆయన 
సీతానగరం, పోచమ్మ గండి, దేవి పట్నం ప్రాంతాలను పరోశీలించారు. నీట మునిగిన గ్రామాల్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, జరిగిన నష్టం, అందుతున్న సహాయం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
 
"వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వరద బాధితులకు పునరావాసం సహాయ కార్యక్రమాలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. వరద బాధితులు పది రోజులుగా నీటిలో ఉన్నారు. కనీసం వారికి టార్పాలిన్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.  వరద వచ్చి పది రోజులు అవుతున్న ఇంకా సోలార్ లైట్లు వస్తున్నాయని అంటున్నారు. 
 
కొంపదీసి గోదావరిలో కలిసిపోయాయి ఏంటో? మంత్రులు  వచ్చి చూసి వెళ్లడం తప్ప ఏం చేయలేదు. ఇక్కడ ఉన్న అధికారులు బదిలీలు చేసి కొత్త అధికారులను ఇక్కడ వేశారు. అందుచేత సహాయ కార్యక్రమాలు కొనసాగడం లేదు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఆహారం పాలు, త్రాగు నీరు సరఫరా చేయలేదు.
 
 జగన్ గాల్లో తిరిగితే సహాయక చర్యలు జరగవు. వరద బాధితులకు నెలకు పది వేలు చొప్పున మూడు నెలలకు 30 వేల రూపాయలు పరిహారం వెంటనే చెల్లించాలి. వరద తగ్గిన తర్వాత నష్టపరిహారం అంచనా వేసి త్వరితగతిన సహాయం అందించాలి. గండికోట నిర్వాసితుల మాదిరిగా పోలవరం నిర్వాసితుల కూడా పరిహారం చెల్లించాలి.
 
 వరద బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. నష్టం పై పూర్తి స్థాయి అంచనా వేసుకొని బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి మద్దతుగా నిలుస్తాం" అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments