Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో టీడీపీకి వెన్నుపోటు... స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్‌

క‌డ‌ప ‌: మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కైవ‌శం చేసుకోవాల‌ని య‌త్నించిన టీడీపీ క‌డ‌ప‌లో మ‌రోసారి కంగుతింది. కడప కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లాపడింది. ఫిరాయింపు కార్పొరేటర్లను నమ్ముకుని బరిలో దిగి అప‌జ‌యాన్ని చ‌విచూసింది. స్టాండింగ

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (21:17 IST)
క‌డ‌ప ‌: మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కైవ‌శం చేసుకోవాల‌ని య‌త్నించిన టీడీపీ క‌డ‌ప‌లో మ‌రోసారి కంగుతింది. కడప కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లాపడింది. ఫిరాయింపు కార్పొరేటర్లను నమ్ముకుని బరిలో దిగి అప‌జ‌యాన్ని చ‌విచూసింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఉన్న ఐదు స్థానాలను వైసీపీయే సొంతం చేసుకుంది. టీడీపీకి కడప కార్పొరేషన్లో 8 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ అధికారంలోకి రాగానే, విడతల వారీగా మరో 12 మంది వైసీపీ సభ్యులను ఆక‌ర్షించింది. దీంతో వైసీపీ బలం 30కి, టీడీపీ బలం 20కి చేరింది. ఈ ఊపులో త్వరలోనే కడప కార్పొరేషన్‌ కూడా కైవసం చేసుకుంటామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తొడ కొట్టారు. 
 
ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ నుంచి తొలుత ఐదుగురు బరిలో దిగగా, చివరి నిమిషంలో ఫిరాయింపు కార్పొరేటర్లకు నోటీసులు జారీ కావడంతో ఇద్దరిని మాత్రమే బరిలో దింపారు. వైసీపీ నుంచి ఐదు స్థానాలకు ఐదుగురు బరిలో దిగారు. తీరా ఓటింగ్‌ పూర్తయ్యాక చూస్తే టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఫిరాయింపు కార్పొరేటర్లతో కలుపుకుంటే టీడీపీ బలం 20. కానీ టీడీపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థికి కేవలం 17 ఓట్లు ఒకరికి, 18 ఓట్లు మరొకరికి పడ్డాయి. ఆ మిగిలిన ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీకి లోలోనే వెన్నుపోటు పొడిచారు. 
 
కడప కార్పొరేషన్‌నే సొంతం చేసుకుంటామని చాలెంజ్ చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఓటింగ్‌లో హ్యాండ్ ఇచ్చిన ఆ ముగ్గురు కార్పొరేటర్లు ఎవరన్న దానిపై ఆరా తీసుకునే పనిలో ఉన్నారు. ఫిరాయింపు కార్పొరేటర్లపై అనుమానం కలిగేలా టీడీపీ కార్పొరేటర్లే ముగ్గురు వైసీపీకి క్రాస్ ఓటింగ్ చేసినట్టు భావిస్తున్నారు. మొత్తం మీద 12 మంది ఫిరాయింపుదారులను తీసుకున్నప్పటికీ కడప కార్పొరేషన్‌లో టీడీపీ పట్టుసాధించలేక టీడీపీ బొక్కబోర్లాపడింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments