మేం గళం విప్పితే వారు వేడుక చూశారు, టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (23:32 IST)
వైసిపి ఎంపిల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు. తిరుపతి వేదికగా మీడియాతో రామ్మోహన్ నాయుడుతో గల్లా జయదేవ్‌లు మాట్లాడారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించాం.. గట్టిగా కేంద్రాన్ని నిలదీశాం.
 
మేము పార్లమెంటులో గళం విప్పితే వైసిపి ఎంపిలు వేడుక చూస్తూ కూర్చున్నారు. అసలు మీరు ఎంపిలేనా అంటూ మండిపడ్డారు రామ్మోహన్ నాయుడు. జగన్‌కు కేసులంటే భయమని.. కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్ ఆలోచన అంటూ విమర్సించారు. 
 
టిడిపి హయాంలోనే తిరుపతి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో అసలు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే వైసిపి నాయకులను ప్రజలు నిలదీయాలని.. టిడిపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
 
అలాగే మరో ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలంటే వైసిపికి అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్థి చేయాల్సిన బాధ్యత వైసిపి ఎంపీలకి లేదా అంటూ ప్రశ్నించారు. వైసిపి ఎంపిలతో పాటు వైసిపి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వారికి త్వరలోనే బుద్ధి చెబుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments