Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలోని ప్రతి డకోటాగాడికి ముందుంది మొసళ్లపండుగ : టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:39 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంచించారు. చంద్రబాబు అరెస్టుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అయితే, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఘాటుగా స్పందించారు. వైకాపాలోని ప్రతి డకోటాగాడికి ముందుంది మొసళ్ల పండుగ అంటూ హెచ్చరించారు. 
 
చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ పతనం ప్రారంభమైందని... 151 సీట్లు ఉన్న వైసీపీ తనకు తాను 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని ఆమె జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు ఉంటాయో కూడా తెలియని అంబటి రాంబాబు చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. 
 
అంబటి రాంబాబును దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పిందని... అయినప్పటికీ న్యాయ వ్యవస్థను కించపరిచేలా అంబటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీద వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కేసులు వేశారని... అయినా చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేకపోయారని... ఈ జగన్ ఎంతని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments