Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడ్డ‌లి పోటుతో బాబాయ్‌ బ‌లి... దొంగ ఓట్లతో ప్ర‌జాస్వామ్యం ఖూనీ!

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (10:49 IST)
బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే, ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నార‌ని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. సీఎం జ‌గ‌న్ రెడ్డి కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టిడిపి నేత‌ల్ని నిర్బంధించి, ఏజెంట్ల‌ని అరెస్టు చేసిన పోలీసులు అరాచ‌కం సృష్టిస్తున్నార‌ని ఆరోపించారు. 
 
 
ఇత‌ర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చిన వారిని కుప్పంలోకి ఎలా రానిచ్చార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్ర‌శ్నించారు. వైసీపీ వ‌లంటీర్లే దొంగ ఓట‌ర్ల‌ని బూత్‌ల‌కు తీసుకొస్తుంటే, ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసుల ముందే దొంగ ఓట‌ర్లు కాలరెగ‌రేసుకుని వెళ్తూ, ఓటేసి వ‌స్తున్నార‌ని ఆరోపించారు.


జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌, పెరిగిన ధ‌ర‌లు, పెంచిన ప‌న్నులు, అధ్వాన రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్న ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ఓట్లు వేస్తే, దారుణ ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న జ‌గ‌న్ రెడ్డి, డెమోక్ర‌సీ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గాల్సిన ఎల‌క్ష‌న్‌ని ఫ్యాక్షనిస్టు క‌నుస‌న్న‌ల్లో జ‌రిగే సెల‌క్ష‌న్ గా మార్చేశార‌ని నారా లోకేష్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments