Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన కర్మాగారాల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాబోదని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు స్పష్టంచేశారు. అయితే, వైకాపా వంటి కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ అంశంపై రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, "విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో తాను కూడా అదే చెప్పాను. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు. వైకాపా మాత్రం ప్రతిరోజూ ఎక్స్‌లో పోస్ట్‌ పెడుతుంది. ఇంకా వాళ్లకు బుద్ధిరాలేదు" అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 
 
తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు వైకాపా నేతలకు మరో అంశం లేదన్నారు. అందుకే ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన అతి సున్నితమైన విశాఖ ఉక్కు అంశంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పినా వైకాపా నేతలకు ఇంకా బుద్ధిమారలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments