Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాలు.. టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా : రైల్వే అధికారులపై రాయపాటి ఫైర్

రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:14 IST)
రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వే అధికారులు ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉన్నారన్నారు. 
 
తమ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ రాయపాటి మాట్లాడుతూ... రైల్వే అధికారులు చిన్నచిన్న పనులు కూడా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలు తమను చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. భోజనం, టిక్కెట్ కోసం సమావేశాలకు వస్తారా అని మండిపడ్డారు.
 
తాను మాట్లాడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినప్పటికీ తాను మాట్లాడుతానని చెప్పారు. రైల్వే అధికారులు ప్రధాని కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలుత రైల్వేజోన్ రావాల్సి ఉందని రాయపాటి అన్నారు. రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమని రాయపాటి ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments