Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రమేష్ 'ఉక్కు' దీక్ష - క్షీణిస్తున్న ఆరోగ్యం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణ

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (13:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన మాత్రం ఉక్కు సంకల్పంతో దీక్షను కొనసాగిస్తున్నారు.
 
దీంతో ఆయనకు శనివారం వైద్యులు పరీక్షలు చేశారు. కడప రిమ్స్ వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం సీఎం రమేష్ చాలా నీరసంగా ఉన్నారని, షుగర్ లెవల్స్ తగ్గాయని, బీపీ కూడా తగ్గుతోందని తెలిపారు. 
 
మరోవైపు, రమేష్ దీక్షకు మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఎమ్మెల్యేలు బొండా ఉమ, ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు కడపకు వచ్చి రమేష్, రవిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. కాగా, సీఎం రమేష్‌తో పాటు.. ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఈ దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments