Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ సమయంలోనైనా ఎన్నిక‌లు రావచ్చు... ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు జోస్యం

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:55 IST)
ఏపీలో ఏ స‌మ‌యంలో అయినా ఎన్నిక‌లు రావ‌చ్చ‌ని ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు జోస్యం చెప్పారు. అందుకు టీడీపీ క్యాడ‌ర్ ఇప్ప‌టి నుంచే సిద్ధంగా ఉండాల‌న్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో అవమానించినా, ప్ర‌తిప‌క్షంగా వైసీపీ ప్ర‌భుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారని ఎంపీ రామ్మోన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
 
అందరూ సిద్దంగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి టీడీపీకి 151 సీట్లకుపైగా రావాలన్నారు. తెలుగు దేశం జండా చూస్తే, వైఎస్సార్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలన్నారు. మనం భయపడే రోజులు పోయాయని, జగన్మోహన్ రెడ్డి భయపడే రోజులు వచ్చాయన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారంద‌రికీ తాను అండగా ఉంటానని రామ్మోన్ నాయుడు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments