షో మాస్టర్లు వద్దు... టాస్క్ మాస్టర్లు కావాలి.. లేదంటే టీడీపీ మటాష్ : కేశినేని నాని

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (12:48 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కాపాలంటే పని చేసే సత్తా ఉన్న నేతలు (టాస్క్ మాస్టర్లు) కావాలని, షో మాస్టర్లు అక్కర్లేదని ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. 
 
గత కొంతకాలంగా కేశినేని నాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రతి అంశంపైనా ఆయన స్పందిస్తున్నారు. చివరకు పార్టీ అంతర్గత విషయాలపై సైతం ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే.. ప్రస్తుతం టీడీపీకి షో మాస్టర్లు అక్కర్లేదనీ, టాస్క్ మాస్టర్లు కావాలని, అపుడే టీడీపీని కాపాడుకోగలమన్నారు. ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణాలు లేకపోలేదు. 
 
గత ఎన్నికల్లో టీడీపీ నేత నాగూర్ మీరాను విజయవాడలోని ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నాని ప్రతిపాదించారు. దీన్ని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారడంతో విషయం టీడీపీ అధినేత చంద్రబాబు వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలోనే బుద్ధా వెంకన్న లాంటి షో మాస్టర్లు కాకుండా తనలాంటి కష్టపడి పనిచేసేవారే పార్టీకి అవసరమని టీడీపీ అధిష్ఠానానికి కేశినేని పరోక్ష సందేశాన్ని పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments