Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ చెప్పింది అక్షరాలా నిజం.. కేసీఆర్ ది ఔదార్యం కాబట్టే...: కేశినేని నాని

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:49 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోదావరి జలాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ఔదార్యం అన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. 
 
మీరు చెప్పింది అక్షరాలా నిజం జగన్ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్‌కు అంత ఔదార్యం ఉండబట్టే కదా ఎన్నికలలో మీకు అంత సాయం చేశారంటూ ఆరోపించారు. అందుకు సంబంధించి ఒక న్యూస్ పేపర్ క్లిప్‌ను పొందుపరిచారు. 
 
ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంశల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ ది ఔదార్యం అంటూ కితాబిచ్చారు. గోదావరి జలాలు ఇస్తున్నారంటూ ప్రశంసించారు. 
 
ఏపీ భూభాగం నుంచి కాకుండా తెలంగాణ నుంచే గోదావరి జలాలు వస్తున్నాయని అలాంటి సమయాల్లో సంతోషించాల్సింది పోయి విమర్శలా అంటూ నిప్పులు చెరిగారు. జగన్ వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని నాని ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments