ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.... చాలా తెలివైన వాళ్లు: జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో వున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.. చాలా తెలివైన వాళ్లంటూ

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (15:49 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో వున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.. చాలా తెలివైన వాళ్లంటూ కౌంటర్ ఇచ్చారు. తాను కూడా పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డితో మాట్లాడతానని.. అయినంతమాత్రానికి వాళ్లతో టచ్‌లో వున్నట్లవుతుందా అంటూ ప్రశ్నించారు. 
 
విజయసాయిరెడ్డిని చూస్తే బాగున్నారా అంటూ పలకరిస్తా.. ఎంపీలందరితోనూ మాట్లాడుతా.. వాళ్లతో కలిసి కాఫీ తాగుతూ.. వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకుంటా. అయినంత మాత్రానికే పార్టీ మారుతున్నట్టా? అంటూ జేసీ అడిగారు. వైకాపా నేతలతో మాట్లాడినంత మాత్రానా పార్టీ మారుతున్నట్లవుతుందా? ఎమ్మెల్యేలు చాలా తెలివైన వాళ్లని జేసీ చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీ వాళ్లను జగన్ తీసుకుంటాడని తెలుసు. అర్హులు కాని వాళ్లకు, ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్లకు.. అవినీతిపరులకు టిక్కెట్లు ఇవ్వనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ చెప్తూనే వున్నారు. అలాంటప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కొందరు జగన్ దగ్గరకు వస్తారు. వాళ్లకు వైకాపా టిక్కెట్లు ఇవ్వమని జేసీ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments