Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు హత్యకు కుట్ర.. ఆత్మహత్య చేసుకుంటానంటున్న టీడీపీ నేత

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (15:34 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యకు కుట్ర జరుగుతోందని, అందుకే ఆయన ఇంటిపై డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా ఆరోపించారు. ఇటీవల కిరణ్ అనే వ్యక్తి చంద్రబాబు ఇంటికి సమీపంలో డ్రోన్లతో టీడీపీ కార్యకర్తలకు చిక్కిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. 
 
ఈ అంశంపై బుద్ధా వెంకన్నా స్పందిస్తూ, చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతుందన్నారు. అందుకే చంద్రబాబు ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీశారని విమర్శించారు. చంద్రబాబు ఇంటి దగ్గర స్వయంగా వైసీపీ మంత్రులు రెక్కీ నిర్వహించారని ఆయన ఆరోపించారు. 
 
చంద్రబాబుపై పన్నుతున్న కుట్రలను ఇప్పటికైనా వైసీపీ ఆపాలని సూచించారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించారు. చంద్రబాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని బుద్ధా వెంకన్నా డిమాండ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments