ముద్దుల ర్యాలీలకు తెరలేపిన శ్రీ జగన్‌గారు : బుద్ధా వెంకన్న

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (12:07 IST)
తన తండ్రి హయాంలో సంపాదించిన సొమ్మునంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే, ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులు అటాచ్ చేశారనీ, అలా పోయిన డబ్బునంతా తిరిగి రాబట్టుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఎత్తుగడ వేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ, ఈడీ అటాచ్మెంట్ చేసేసరికి మూడు రాజధానుల పేరుతో కొత్త ఎత్తుగడ వేసారు వైఎస్. జగన్‌గారు. బినామిల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారు. మరో రూ.50 వేల కోట్లు కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరోసారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడు. 
 
విశాఖలో జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయం. వడ్డీతో సహా జగన్‌గారు, 8 నెలల నుండి విశాఖలో ఉండి ల్యాండ్ మాఫియా కింగ్‌పిన్‌గా మారిన వైఎస్ రెడ్డి భవిష్యత్‌లో ఊచలు లెక్కపెట్టడం ఖాయం" అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments