Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను విన్నాను... నేను ఉన్నాను అంటే... గుర్తుకువచ్చేది.. బుద్ధా వెంకన్న సెటైర్లు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (17:15 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఆయన కుడిభుజంగా ఉన్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తనదైనశైలిలో సెటైర్లు వేశారు. 'నేను విన్నాను, నేను ఉన్నాను' అనగానే సీఎం జగనే గుర్తుకువస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న స్పందించారు. 
 
'నేను విన్నాను, నేను ఉన్నాను' అంటే గుర్తుకు వచ్చేది సీఎం జగన్ కాదు విజయసాయిరెడ్డిగారూ, అధికార దాహంతో ఆయన అడ్డగోలుగా ఇచ్చిన హామీలు, అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేసిన తీరే గుర్తుకువస్తుంది అంటూ ఘాటుగా విమర్శించారు.
 
ముఖ్యంగా, 'ఒక్కసారి గ్రామాల్లో తిరగమనండి... మేము ఉన్నాము, బడితెపూజ చేస్తాము అంటూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్‌ను గ్రామాల్లోకి పంపితే ఎవరి ఇమేజ్ ఏంటో అప్పుడర్థమవుతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, 'మీరు, జగన్ పత్రికా విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది విజయసాయిరెడ్డి గారూ! తెలుగువారి మనస్సాక్షి సాక్షి పేపర్ అంటూ జగన్ గారు ఘోరమైన స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మీ బుద్ధి ఏమైంది? నిత్యం మీ బ్రోకర్ పనులకు మడుగులు ఒత్తే చెత్త పేపర్‌ను, చానల్‌ను తెలుగువారి మనస్సాక్షి అంటూ బిల్డప్ ఇచ్చినప్పుడు ధార్మికతను ఆపాదించినట్టు అనిపించలేదా?' అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments