Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం.. రాజీనామాలకు గంట పిలుపు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవి రాష్ట్రంలో కలకలం రేపాయి. దీనిపై తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం అవుతుందనే వార్త యావత్‌ రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసిందన్నారు. 
 
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరంకాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. 'రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించాం. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేవని కుంటిసాకు చూపి ప్లాంట్‌ని వంద శాతం ప్రైవేటుపరం చేయడం దారుణం. 
 
ఈ విషయంలో కేంద్రం ఆలోచన సరైంది కాదు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ఇస్తున్నందున.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ మేరకు గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలి. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించాలి. అవసరమైతే ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి' అని ఈ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments