Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్లే ఓటు మురిగిపోయింది.. ఎమ్మెల్యే భవానీ

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల రామయ్య మాత్రం ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, అది చెల్లలేదు. ఆమె చేసిన చిన్న తప్పు వల్ల ఆ ఓటు మురిగిపోయింది. దీనిపై తెదేపా ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. 
 
రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని తెలిపారు. ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు.
 
పైగా, రాజ్యసభ ఎన్నికల పోలింగులో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, అయితే, అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టవచ్చా అని అడిగితే వారు ఓకే చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. 
 
ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments