Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడాలి నాని ఉల్లిపాయ పకోడీలాంటి వాడు.. చీటర్సే ఆ పని చేశారు.. జగన్ జైలుకెళ్లడం...?

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉల్లిపాయ పకోడీలాంటి వాడని.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచి.. అదే పార్టీపై విమర్శలు గుప్పించడం దారుణమన్నారు.

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (17:35 IST)
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉల్లిపాయ పకోడీలాంటి వాడని.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచి.. అదే పార్టీపై విమర్శలు గుప్పించడం దారుణమన్నారు. 
 
రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే అంశాన్ని వైసీపీ యూనివర్శిటీ నేర్పిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న చీటర్స్ అందరూ కలిసి వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. టీడీపీపై నాని విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.
 
ముఖ్యమంత్రిని విమర్శించేంత స్థాయి నానికి లేదని బుద్ధా వెంకన్న వెల్లడించారు. నాని మాటలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. 2019 నాటికి వైసీపీ దుకాణం బంద్ అవుతుందని... ఆ పార్టీ అధినేత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని బుద్ధా వెంకన్న అన్నారు.
 
వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్లీనరీపై టీడీపీ నేతలు జగన్‌ను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి సామ్రాట్‌ అయిన జగన్‌.. అవినీతిపై పుస్తకాలు ముద్రించడం చాలా హాస్యాస్పదమని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments