Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అంటేనే త్యాగాలకు మారు పేరు : ముఖ్యమంత్రి చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (13:36 IST)
తెలుగుదేశం పార్టీ అంటేనే త్యాగాలకు మారుపేరని ఏపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తాను అధ్యక్షుడిగా కాకుండా ఓ కార్యకర్తగానే పాల్గొంటున్నట్టు చెప్పారు. తెలుగుజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచే వ్యక్తి నందమూరి తారకరామావేనని చెప్పారు.
 
తిరుపతిలోని నెహ్రూమున్సిపల్ సభాస్థలిలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు పాల్గొన్నారు. మహానాడులో మొదటగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన చంద్రబాబు ఆ తర్వాత జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఫోటో గ్యాలరీని తిలకించారు. నందమూరి తారకరామారావు సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ఫోటో గ్యాలరీలో ఏర్పాటు చేశారు. అలాగే చంద్రబాబు రాజకీయానికి సంబంధించిన రాజకీయ ప్రస్థానం, నారా లోకేష్‌ రాజకీయాలకు సంబంధించిన ఫోటోలను ఫోటో గ్యాలరీలో ఏర్పాటు చేశారు.
 
అలాగే ఎన్టీఆర్ రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు శిబిరంలో రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తున్న వారిని బాబు అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మహానాడులో మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్‌టిఆర్‌ అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో పార్టీలు వెళ్ళాయి.. అయితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశమేనన్నారు. రైతులు, మహిళలు, యువకులు, అన్నార్తుల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా ఆవిర్భవించిందన్నారు. పార్టీ కోసం ఎందరో ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్నారని, వారికి పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.
 
రాజకీయాల్లో క్రమశిక్షణ, అంకితభావంతో ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష ఉండాలని చంద్రబాబు అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెదేపానని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి ఎన్‌టిఆర్‌ రికార్డు సృష్టించారని చెప్పారు. రెండు రూపాయలకే కిలో బియ్యంను ప్రవేశపెట్టింది ఎన్‌టిఆరేనని గుర్తు చేశారు. హైదరాబాదును ప్రపంచంలో పటంలో మేమే పెట్టామన్నారు బాబు. దేశంలోనే ఏపీని మొదటిస్థానంలో నిలిపే వరకు నిద్రపోనన్నారు. మహానాడులో బాలక్రిష్ణతో పాటు నారాలోకేష్‌, సీనియర్‌ నాయకుందరు పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments