Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా రోజమ్మా... "బదాం సాంగ్" సాంగ్‌కు డ్యాన్స్ చేసినంత ఈజీ కాదు.. అనిత ఫైర్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (15:27 IST)
ఏపీ మంత్రి ఆర్.కె.రోజాపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమ్మా రోజమ్మా... "మహిళా సాధికారత అంటే 'కచ్చా బదాం' సాంగ్‌కి డ్యాన్స్‌లు వెయ్యడమో, జబర్దస్త్‌‍లో డబుల్ మీనింగ్ డైలాగులకి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదు అంటూ సెటైర్లు వేశారు. 
 
అలాగే, "మీ నాయకుడికి ఏ రంగు చీర పంపిస్తావ్ రోజా? ఈ చీరల టాపిక్ తెచ్చిందే కుడితిలో పడ్డ ఎలుకలా అయిన వాసిరెడ్డి పద్మ. మీకు ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైంది. వేలాది మంది పోలీస్ పహారా, పరదాలు లేకుండా బయటకు అడుగు కూడా పెట్టలేని జగన్ రెడ్డికీ, నిత్యం జనంలో ఉండే లోకేష్ గారికీ పోలికా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
"పాత సినిమాల్లో బందిపోట్లు రోడ్డు మీదికి వస్తే అందరూ ఇళ్లలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకునేవారు. ఇప్పుడీ సీఎం బందిపోటులా ఊరి బయటకి వస్తే ప్రజల పరిస్థితి ఇలాగే ఉంది. ఇతగాడు ఇల్లు దాటి బయటికి వస్తే పోలీసులందరూ పహారా కాయడం ఒకెత్తయితే, షాపులూ మూసేయాలట, ప్రజలు ఇళ్లలోకి వెళ్లి కిటికీ తలుపులు కూడా వేసుకోవాలట. 
 
వీళ్లు చంద్రబాబు కరకట్ట నివాసం గురించి మాట్లాడేవాళ్లా? వీళ్లకు సిగ్గుందా? బుర్రలు ఏమైనా పనిచేస్తున్నాయా లేదా? మహిళా సాధికారిత జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటుంటే నాకు నవ్వొస్తోంది. రాష్ట్రంలో జరిగిన అనేక అత్యాచార ఘటనలపై నోరు మెదపని సీఎంకు చెప్పండి ఏం రంగు చీర కట్టుకోవాలో!" అంటూ రోజాపై అనిత నిప్పులు చెరిగారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments