Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని నెహ్రూ కన్నుమూత : బోరునవిలపించిన నందమూరి హరికృష్ణ

టీడీపీ నేత దేవినేని నెహ్రూ మరణవార్తవిని నందమూరి హరికృష్ణ బోరునవిలపించారు. సోమవారం ఉదయం దేవినేని నెహ్రూ గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న నందమూరి హరికృష్ణ హుటాహుటిన కేర్ ఆసుపత్ర

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (10:13 IST)
టీడీపీ నేత దేవినేని నెహ్రూ మరణవార్తవిని నందమూరి హరికృష్ణ బోరునవిలపించారు. సోమవారం ఉదయం దేవినేని నెహ్రూ గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న నందమూరి హరికృష్ణ హుటాహుటిన కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. దేవినేని భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టారు.
 
ఎన్టీఆర్ హయాం నుంచే తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన దేవినేని నెహ్రూ ఆ సమయంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బెజవాడ రాజకీయాల్లో దనదైన ముద్రవేశారు. ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణతో దేవినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ స్వయంగా కేర్ ఆసుపత్రికి వచ్చి దేవినేని భౌతికకాయాన్ని సందర్శించారు. 
 
అలాగే, దేవినేని నెహ్రూ మరణంతో బెజవాడలోని ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలుసుకున్న నెహ్రూ అనుచరులు, కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ దేవినేని మృతిపై స్పందించారు. దేవినేని నెహ్రూ మరణ వార్త విని ఎలా స్పందించాలో అర్థం కాలేదని, నోట మాట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నెహ్రూ మృతి తనను తీవ్రంగా బాధించిందని, వ్యక్తిగతంగా ఇది తనకు తీరనిలోటని ఆవేదన చెందారు. నెహ్రూ రాజకీయ గతాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బుద్దప్రసాద్ అన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments