Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అభ్యర్థుల జాబితా... 20 మంది వారసులు, బంధువుల పిల్లల

వరుణ్
ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (12:39 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు. అయితే, ఈసారి ఎన్నికల్లో పలువురు టీడీపీ నేతల వారసులు, బంధువులు కూడా బరిలో ఉన్నారు. దాదాపు 20 మంది వరకూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగనున్నారు. వీరిలో కొందరు తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటుండగా మరికొందరికి గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది
తొలిసారి పోటీ చేయబోయేది వీరే!
 
కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం): ఈయన దివంగత కొండపల్లి పైడితల్లినాయుడి మనవడు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడికి సోదరుడి కుమారుడు. శ్రీనివాస్ తండ్రి కొండలరావు గతంలో గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు.
 
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య (తుని). తుని టీడీపీ ఇన్చార్జ్ ఉన్నారు.
 
ఆదిరెడ్డి వాసు (రాజమహేంద్రవరం నగరం): మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి సొంత బావ.
 
బడేటి రాధాకృష్ణ (ఏలూరు): దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు సోదరుడు. ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ గా ఉన్నారు.
 
వర్ణ కుమార్ రాజా(పామర్రు): టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనయుడు.
 
నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట): మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె. తిరుపతిలో వైద్యురాలు.
 
రెడ్డప్పగారి మాధవి (కడప): మాజీ మంత్రి ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
 
ఎస్.సవిత (పెనుగొండ): మాజీ మంత్రి, మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె. ఆ వారసత్యంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
 
ఎంఈ సునీల్కుమార్ (మడకశిర): మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments