చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయింది : ఆర్కే.రోజా

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగాగా ఆమె ప్రసంగిస్తూ, అసెంబ్లీలో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.
 
చంద్రబాబు ఆయన కుమారుడిని అమెరికాలో చదివించానని గొప్పలు చెబుతున్నారని.. కానీ లోకేశ్‌ జయంతికి, వర్ధంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమో, దేశమో అనేది కూడా చెప్పలేని స్థితిలో లోకేశ్‌ ఉన్నాడని విమర్శించారు. 
 
చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని అర్థమవుతోందన్నారు. టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా అని నిలదీశారు. 
 
సభలో సోమవారం మహిళా భద్రతపై చర్చసాగుతూంటే.. టీడీపీ నేతలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని వచ్చి ఆందోళన చేశారన్నారు.  మహిళలకు మీరు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. వారు చేసిన హడావిడి నేపథ్యంలో ఈ రోజు చర్చకు జగన్మోహన్ రెడ్డి అవకాశమిచ్చినప్పటికీ వారు ఉపయోగించుకోవడంలేదన్నారు.
 
'టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? రైతులు తమ ఉత్పత్తులకు మద్దతు ధర రాక వారు నలిగిపోయిన పరిస్థితులు తెలియదా?' అంటూ చంద్రబాబును సభాముఖంగా నిలదీశారు. 
 
రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి రైతు శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు పోతున్నారని చెప్పారు. రైతు భరోసాను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిపోయి.. ప్రతిపక్ష నాయకుడు విమర్శలకు దిగడం సబబు కాదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments