Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత ఆస్పత్రిలోనే కరోనా సోకి తెదేపా మాజీ ఎమ్మెల్యే మృతి!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (07:51 IST)
చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూశారు. ఆమెకు కరోనా వైరస్ సోకడంతో బెంగుళూరులోని తన సొంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయస్సు 70 యేళ్లు. ఈమె తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా. 
 
గత నెల 10వ తేదీన ఆమెకు కరోనా వైరస్‌ సోకడంతో సొంత ఆస్పత్రి అయిన బెంగళూరులోని వైదేహీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఈ నెల 3వ తేదీ నుంచి విషమంగా మారడంతో వెంటిలేటర్‌ మీద ఉంచారు. అయితే, గురువారం రాత్రి ఆమె కన్నుమూసినట్టు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. 
 
కాగా, చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబరు 21న జన్మించారు. బెంగళూరులో మెట్రిక్యులేషన్‌ దాకా చదివారు. విద్యార్థిగా వున్నప్పటినుంచే ఆమె పుట్టపర్తి సాయిబాబాకు భక్తురాలు. చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డీకే ఆదికేశవులును వివాహం చేసుకున్నారు. 
 
అప్పటివరకు సాధారణ ఉద్యోగి, వ్యాపారవేత్తగా ఉన్న ఆదికేశవులు పెళ్లి తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కాంగ్రెస్‌లో పేరున్న నాయకుడిగా ఎదిగిన ఆయన 2004లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా గెలిచారు. టీటీడీ ఛైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు.2009లో ఆదికేశవులు అనారోగ్యంతో మరణించాక గృహిణిగా ఉన్న సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments