Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. హైలైట్స్ ఇవే..

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (15:28 IST)
ఉగాది సందర్భంగా పూజలు, పంచాంగశ్రవణం నిర్వహించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల మేనిఫెస్టోను నిర్వహించారు. ఈ మేనిఫెస్టోలో డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్ అందజేయనున్నారు. 
 
అంతేగాకుండా.. మేనిఫెస్టోలో వున్న హైలైట్స్ సంగతికి వస్తే.. 
 
మహిళా ఉద్యోగుల కోసం ప్రోత్సాహక నిధులతో కింద స్కూటర్లు కొనుగోలు
ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల కోసం అనేక సదుపాయాలు
పెన్షన్లు రూ.3000కి పెంపు
వయోపరిమితి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గింపు
 
చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు
పెళ్లి కానుక లక్ష రూపాయల పెంపు
20,000 జనాభా దాటిన అన్ని మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు
పేద కుటుంబాలకు పండుగ వేళల్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేత
 
ఎస్సీ, ఎస్టీల కోసం పదేళ్ల పాటు ఉప ప్రణాళిక అమలు
100 గురుకుల పాఠశాలల స్థాపన
ఎస్టీల కోసం ప్రత్యేకంగా 50 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీలు అన్ని వర్గాల వారికి విదేశీ విద్య కోసం రూ.28 లక్షలు
 
ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం, జగజ్జీవన్ రామ్ స్మృతివనం పూర్తి
మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ స్థాపన
 
లిడ్ క్యాప్ తో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు
ఐటీడీఏ పరిధిలో యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్
వెనుకబడిన వర్గాల కోసం రూ.10,000 కోట్లతో బీసీ డెవలప్ మెంట్ బ్యాంక్
బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత
 
ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 25 శాతం ప్లాట్లు బీసీల పరం
బీసీలు స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా తరహా కార్ల కొనుగోలులో 25 శాతం రాయితీ
బీసీ విద్యార్థుల కోసం 200 రెసిడెన్షియల్ స్కూళ్లు
 
బీసీ మత్స్యకారుల క్రాప్ హాలీడే పరిహారం రూ.4000 నుంచి రూ.10,000కి పెంపు
మత్స్యకారుల డీజిల్ కొనుగోలులో లీటర్ పై రూ.10 రూపాయల వరకు ఇన్సెంటివ్ పెంపు
బోయ, వాల్మీకి, వడ్డెర, రజక కులాలను ఎస్టీల్లో చేర్చాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు
 
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కని వడ్డెర, బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు
చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా
మార్కెటింగ్ నిధుల కింద రూ.250 కోట్లు
మంగళగిరిలో చేనేత సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కింద అన్నిరకాల అభివృద్ధి చర్యలు
చేనేత కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు
 
కాపులకు 5 శాతం రిజర్వేషన్ల కొనసాగింపు
ఐదేళ్లపాటూ అన్నదాత సుఖీభవ అమలు
రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
రైతు బీమా రూ.10 లక్షలతో పాటు పంటల బీమాను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
పగటిపూట 12 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్
 
పంటలకు గిట్టుబాటు ధరల కోసం రూ.5000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు
రాష్ట్రంలో 100 శాతం ప్రకృతిసేద్యానికి ప్రోత్సాహం
రాష్ట్రాన్ని హార్టీకల్చర్ హబ్ గా ఏర్పాటు
40 లక్షల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు పండ్లతోటల పెంపు
సూక్ష్మనీటిపారుదల కిందికి కోటి ఎకరాలు
 
ఫిషరీస్ లో కోల్డ్ చెయిన్ లింక్, ప్రాసెసింగ్ రంగాలకు మరింత దన్ను
షిప్ ల్యాండింగ్ సెంటర్ల వద్ద మరిన్ని సదుపాయాలు ఏర్పాటు
తీరప్రాంతాల్లో మత్స్యకారుల కోసం జెట్టీల నిర్మాణం
ఆవులు, గేదెలకు 75 శాతం రాయితీ
దాణాపైనా అత్యధిక రాయితీలు అందిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments