Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలంద కిషోర్‌ను ప్రభుత్వం హత్య చేసింది : చంద్రబాబు

Webdunia
శనివారం, 25 జులై 2020 (14:34 IST)
విశాఖ జిల్లాలో టీడీపీ అభిమాని, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రధాన అనుచరుడు నలందా కిషోర్ మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. నలంద కిషోర్‌ను ప్రభుత్వమే హత్య చేసిందంటూ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. 
 
"విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం. కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు పెట్టి.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, ఆయన వయసును కూడా లెక్కచేయకుండా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకుపోయారు". 
 
"అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా? నలంద కిషోర్ మృతి ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కిషోర్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది" అంటూ నిలదీశారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments