Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీలు చూసుకుని ఢిల్లీకి రమ్మన్నారు : మోడీ కరచాలనంపై బాబు వివరణ

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (07:36 IST)
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య కరచాలన భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏం జరిగిందో పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ భేటీ ద్వారా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చింది. 
 
దీని గురించి పార్టీ నేతలకు చంద్రబాబు అన్ని వివరాలను వివరించారు. "రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను ఒక పక్కన ఉండి వేరే వారితో మాట్లాడుతున్నాను. ప్రధాని ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే నా వద్దకు వచ్చారు. మనం కలిసి చాలా రోజులైంది... ఢిల్లీ రావడం లేదా అని అడిగారు. ఢిల్లీలో నాకు పనేమీ లేదని, రావడం లేదని చెప్పాను. 
 
మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి.. మనం ఒకసారి కలవాలని ఆయన అన్నారు. నేను కూడా మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నానని చెప్పాను. ఒకసారి వీలు చూసుకుని ఢిల్లీ రండి. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే నాకు అనువుగా ఉన్న సమయం చెబుతాను.. వద్దురు గాని అని ఆయన అన్నారు. నేను కూడా సరేనన్నాను" ఇదీ ఢిల్లీలో జరిగిందని పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments