కుప్పంలో టీడీపీని ఓడించలేదు.. ప్రజాస్వామ్యాన్ని ఓడించారు...

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (07:54 IST)
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. వైకాపా అభ్యర్థులు విజయభేరీ మోగించారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హతమార్చారని మండిపడ్డారు. 
 
ఓట్ల లెక్కింపును కూడా ఇష్టానుసారం మార్చివేసి టీడీపీ గెలిచిన పంచాయతీలను కూడా వైసీపీ ఖాతాలో వేసుకొన్నారని, అధికార పక్ష ఉన్మాదులు... రౌడీల స్వైర విహారాన్ని ఎన్నికల కమిషన్‌ కూడా ఆపలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. 
 
పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రాత్రిపూట వద్దని, పగలు జరపాలని మేం కోరాం. ఎన్నికల కమిషన్‌ పట్టించుకోలేదు. లెక్కింపు ప్రక్రియను కెమెరాలతో రికార్డు చేయాలని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. దానిని ఎక్కడా పాటించలేదు. రాత్రిపూట ఓట్ల లెక్కింపు సమయంలో కరెంటు పోయిందనే సాకుతో కొన్నిచోట్ల ఫలితాలు అడ్డగోలుగా మార్చేశారు. 
 
నిబంధనల ప్రకారం రెండు అంకెల్లో మెజారిటీ ఉన్నచోట రీకౌంటింగ్‌ అవసరం లేదు. రీ కౌంటింగ్‌ కూడా ఒకసారి మాత్రమే జరపాలి. కానీ మూడు, నాలుగు సార్లు రీకౌంటింగ్‌ జరిపి వైసీపీ గెలిచిందని ప్రకటించేశారు. రాత్రివేళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మూడో విడత ఫలితాల్లో సాయంత్రం ఏడు గంటల వరకూ టీడీపీ ఆధిక్యం ఉందని ప్రభుత్వ అనుకూల టీవీలతోసహా అందరూ చూపించారు. 
 
ఆ తర్వాత డ్రామా మొదలైంది. తొమ్మిదిన్నరకు వైసీపీకి  కొద్ది ఆధిక్యం చూపించారు. ఆతర్వాత ఫలితాలను ఏకపక్షంగా మార్చేశారు. టీడీపీ గెలిచిన పంచాయతీల్లో వైసీపీ గెలిచినట్లుగా ఫలితాలను మార్చేశారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments