Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ ఘనవిజయం.. ఇక్కడ సీన్ రివర్స్.. టీడీపీకి షాక్ తెప్పిస్తున్న పట్టభద్ర ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన అధికార టీడీపీకి.. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. అనంతపురం, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనుకంజలో ఉంది. ఈ రెండు చోట్లా వైఎస్ఆర్

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (03:07 IST)
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన అధికార టీడీపీకి.. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. అనంతపురం, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనుకంజలో ఉంది. ఈ రెండు చోట్లా వైఎస్ఆర్ సీపీ బలపరిచిన పీడీఎఫ్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీడీపీ వెనుకంజలో ఉంది.
 
అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ.. అనంతపురం, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తుది ఫలితాలు వెల్లడి కావాల్సివుంది.  వైఎస్‌ఆర్‌, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ఆ మూడు సీట్లు వైఎస్ఆర్ సీపీనే సునాయాసంగా గెలుస్తుంది.  కానీ టీడీపీకి బలం లేకున్నా.. వైఎస్ఆర్ సీపీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రలోభాలు పెట్టి, దారికి రాకుంటే బెదిరించి మరీ ఓట్లు వేయించుకుంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగులుతోంది.
 
టీడీపీ స్థితి ఇలాగే మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు భవిష్యత్‌లో టీడీపీ స్థితికి అద్దం పడతాయని వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ప్రలోభపెట్టడానికి అవకాశం లేని ఎన్నికల్లో స్వేచ్ఛగా పౌరులు పాల్గొంటే టీడీపీ ఎదుర్కోలేదని స్పష్టమైందని చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments