Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అరెస్టు : ఏపీలో కొనసాగుతున్న బంద్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (08:57 IST)
ఏపీ నైపుణ్యాద్ధి సంస్థలో అవినీతి చోటుచేసుకుందని పేర్కొంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీనికి నిరసంగా ఆ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో బంద్ కొనసాగుతుంది. కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, కూడళ్లలో పెద్ద ఎత్తున ఆందోళ చేస్తున్నారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
 
చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఒంగోలు బస్టాండ్, గిద్దలూరు బస్టాండ్ల వద్ద ఆందోళన కొనసాగుతోంది. బస్సులు అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయనగరంలో బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.
 
తిరుపతిలోని అంబేద్కర్ కూడలి వద్ద టీడీపీ నేతల నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్ డిపో ఎదుట టీడీపీ నాయకులు ఆందోళన దిగారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోకు, నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.


రాజమండ్రి జైలుకు చంద్రబాబు... ప్రత్యేక గది కేటాయించాలని కోర్టు ఆదేశం
 
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందని పేర్కొంటూ సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే ఆయన ఈ నెల 22వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు, రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గదిని కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. అలాగే, ఆయనకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స కూడా అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశం చేసింది. 
 
కాగా, చంద్రబాబును రాజమండ్రి జైలుకు ఆయన సొంత కాన్వాయ్‌లోనే తరలిస్తున్నారు. ప్రస్తుంత విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రికి చేరుకునేందుకు కనీసం రెండు గంటలకు పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా వెళుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలావుంటే చంద్రబాబు అరెస్టుకు టీడీపీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తున్నట్టు తీర్పు వెలువరించిన అనంతరం... ఇదే కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‍పై వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్‌ను కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments