Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడిపోతామనే భయంతోనే టిడిపి బహిష్కరణ డ్రామా: కొడాలి నాని

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:48 IST)
రాష్ట్రంలో వైసిపి ప్రభంజనం ముందు తట్టుకోలేక చిత్తుగా ఓడిపోతామనే భయంతోనే టిడిపి 'పరిషత్తు' ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. బహిష్కరణ వాస్తవమైతే టిడిపి గుర్తుపై గెలిచిన 800 మంది అభ్యర్థులు ఆ పార్టీని, చంద్రబాబును ధిక్కరించినట్లేనా? అని ప్రశ్నించారు.

నోటిఫికేషన్‌ విడుదలై, నామినేషన్లు కూడా వేశాక మరో మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా, చంద్రబాబు కోసం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేసి పారిపోయారని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే?!...
 
1- రాష్ట్రంలో జరిగిన పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్లు, పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏడాదిన్నర పట్టడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. 2020 మార్చిలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా, ఇంకా మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందనగా, రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియకు భయపడి చంద్రబాబు నాయుడు, అప్పటి ఎన్నికల కమిషన్‌ అధికారి చంద్రబాబు తొత్తుగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికలు వాయిదా వేసి పారిపోవడం జరిగింది.
 
2-  ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో.. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా, ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేక కుప్పం నియోజకవర్గం కావచ్చు.. చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లె కావచ్చు, ఎన్టీఆర్‌ గారి సొంతూరు నిమ్మగడ్డ, ఆయన అత్తగారి ఊరు, చంద్రబాబు కుటుంబసభ్యులు దత్తత తీసుకున్న కొమరవోలులో కావచ్చు.. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గెలవదు... వైయస్సార్‌ సీపీని అడ్డుకోలేమని చెప్పి.. ఎన్నికలు జరిగితే ప్రజల్లో నవ్వులపాలు అవుతారని చంద్రబాబు బాయ్‌కాట్‌ డ్రామాను తెరపైకి తెచ్చాడు. 
 
3- 2020లో నామినేషన్లు అవగానే 20 రోజులపాటు నామినేషన్లలో పాల్గొని.. ఆరోజు ఎందుకు బహిష్కరించలేదు. తన డైరెక్షన్‌లో నిమ్మగడ్డ ఎన్నికలను ఆపుతాడని తెలిసే.. దొడ్డిదారిన ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికల నుంచి పారిపోయిన  పిరికిపంద.  అప్పటికే మున్సిపల్‌, పంచాయితీ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం వైయస్సార్‌ సీపీ గెలిస్తే సింబల్‌ లేదని, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అమాయకులని చెప్పి, ఓడిపోయిన, పనికిమాలిన పార్టీ తామే గెలిచామంటూ వాళ్ల ఆఫీస్‌ ముందు టపాకాయలు కాల్చుకున్నారు. 
 
చంద్రబాబు ఆరోజు సాయంత్రానికి ప్రెస్‌మీట్‌ పెట్టి '81.3 శాతం నేను గెలిచా, 79.22 శాతం నేను గెలిచా..' అంటూ పిచ్చిలెక్కలు చెప్పి, సొల్లు మాటలు చెప్పిన పరిస్థితిని చూశాం. పప్పుగాడు, తుప్పుగాడు.. తెలుగుదేశం పార్టీ నేతలు విజయవాడలో బహిరంగ సభ పెట్టి ప్రజలను బూతులు తిట్టారు. 'జగన్‌ మోహన్‌ రెడ్డి అమరావతిని రాజధానిగా తీసేస్తున్నారు.. మీకు సిగ్గు,శరం ఉంటే నాకు ఓటు వేయండని' అడుక్కున్నారు. గుంటూరులో కూడా అదేవిధంగా బాబు బూతులు తిట్టాడు.
 
4-జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఎక్కడా బయటకు రాలేదు. ఆయన చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యాక్రమాలు.. మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులమీద నమ్మకం కావచ్చు. మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు దీవిస్తారు అనే నమ్మకంతో జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు.
 
5- 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక మున్సిపాల్టీ గెలిచింది. 12 కార్పొరేషన్లలో ఒక్క కార్పొరేషన్‌ కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది.  తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా గత ఎన్నికల కంటే మెజార్టీ పెరిగింది. ఇంత స్పష్టంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారు.  జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని దేవుడు దీవిస్తుంటే చూడలేదని  చంద్రబాబు, తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని చేతకాని కబుర్లు చెబుతాడు.
 
6- టీడీపీ ఎన్నికలు బహిష్కరిస్తే .. ఆ పార్టీ ఓటు బ్యాంక్‌ కూడా వైయస్సార్‌ సీపీకి టర్న్‌ అయిపోతుందా?  -నాలుగు జెడ్పీటీసీలను తీసుకుంటే కుప్పంలో 21వేల ఓట్లు చంద్రబాబుకు వచ్చాయి. 80వేలు చిల్లర వైయస్సార్‌ సీపీకి వచ్చాయి, ​​చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించాడు కాబట్టే ఆయన నియోజకవర్గంలోని కుప్పం ప్రజలంతా వైయస్సార్‌సీపీకి ఓటు వేశారా..? 

15 శాతం ఇతర పార్టీలు గెలిచారు. దానిలో పదిశాతం అంటే 900 ఎంపీటీసీలను టీడీపీ గెలుచుకుంది. వాళ్లంతా చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ, వినకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వారు టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులా? వాళ్లందరిని సస్పెండ్‌ చేస్తారా? వాళ్లంతా చంద్రబాబును ధిక్కరించి ఓటు చేసి గెలిచారా?
 
7- అయితే, చంద్రబాబును నాయకత్వం నుంచి తీసేసి.. ఆ గెలిచిన ఎంపీటీసీ,జెడ్పీటీసీలలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంటే బాగుంటుంది. ఆరోజు ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికి పదేళ్లు ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నా... రాజధానిని అక్కడ అప్పచెప్పేసి.. పారిపోయి వచ్చి కాల్వగట్టన దాక్కున్న వ్యక్తి. ఈరోజు కరోనా వస్తే ప్రజలకు దూరంగా ఇంట్లో దాక్కున్నాడు. ఇక్కడ ఎన్నికల ఫలితాలు వస్తే... హైదరాబాద్‌లో ఉండి స్టేట్‌మెంట్‌లు ఇస్తాడు. పారిపోవటం అనేది చంద్రబాబు రక్తంలో నరనరానా జీర్ణించుకుపోయి ఉంది.
 
8- భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేసిఉంటే మీరిలా ఉండేవాళ్లా అని అంటున్నాడు. జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఇలా చేయబట్టే  ప్రతిపక్షాలు ఏమీలేవు, ప్రతిపక్షాలు అన్నీ ఖాళీ అయిపోయాయి.. అవి ఉండవని చంద్రబాబే ఒప్పుకుంటున్నాడు. నేను కూడా చేసి ఉంటే మీరు ఉండేవాళ్లా అని అంటున్నాడే. అలా అనుకుంటే చంద్రబాబు నాయుడే ఉండడు కదా?
 
9-బాబు  చెప్పే మాటలను  తెలుగుదేశం పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలి. ఇలాంటి  పోసుకోలు కబుర్లు చెప్పే పప్పుగాడిని,తుప్పుగాడిని నమ్ముకుంటే టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే ఏపీలో కూడా పడుతుంది. ఈ జిల్లా పరిషత్‌ ఎన్నికలే నాంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి కూడా ఉండదు. 
 
10- జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని... పప్పుగాడు లోకేష్‌గాడితో మొదలుపెట్టి గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగారిని, మమ్మల్ని అనుచిత వాఖ్యలు చేస్తున్నారు. 'నేను చంద్రబాబుని,  కొడుకు పప్పుగాడిని ఇంకా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలను.

కాకపోతే ‘మా ముఖ్యమంత్రిగారు పోనివ్వు నానీ.. వాళ్లను వదిలేయ్‌.చంద్రబాబు పగా, ప్రతీకారాలతో నన్ను ఏదో చేయాలని, అతని అధికారాన్ని దొంగతనంగా నేనేదో తీసుకున్నట్లు నన్ను భరించలేకపోతున్నాడు. అతడు, అతని కొడుకు, ఆ పార్టీలో సంబంధించిన గాలి వ్యక్తులు నా మీద, ఈ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు నిందలు, బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మన ప్రభుత్వానికి, పార్టీకి మద్దతుగా ఉన్నారు. 

పైన ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి, వాళ్ల అవసరాలు తీర్చడానికే రాజకీయాల్లోకి వచ్చాం... అలాంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుందామని’ ఒకటికి పదిసార్లు చెప్పబట్టి...ఈ తుప్పుగాడు , ఆ పప్పుగాడుని వదిలేస్తున్నా. 
 
11- ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండి... అచ్చెంనాయుడు, అయ్యన్నపాత్రుడు, మీ పార్టీ నుంచి ఎవడైనా సరే...  ముఖ్యమంత్రి గారి గురించి చిన్న మాట మాట్లాడినా.. మిమ్మల్ని ప్రజలే బట్టలూడదీసి రోడ్డు మీద నిలబట్టి  బూతులు తిడతారు. వళ్లు దగ్గరపెట్టుకుని హైదరాబాద్‌లో శేష జీవితం గడుపుకో.
 
12- ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌ లలో గ్రీవెన్స్‌ పెట్టి అర్జీలు తీసుకుంటుంటే.. దేవినేని ఉమ, కొంతమంది టీడీపీ వారిని ఎమ్మెల్యే వంశీ దగ్గరకు పంపించాడంట. నా దగ్గరకు పంపిస్తే తెలిసేది. అక్కడకు వెళ్లి అధికారులను.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేము.. చూస్తామంటూ  నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? నేను, వంశీ విజయవాడలోనే ఉంటాం.....నువ్వు రా తేల్చుకుందాం.  అయిదేళ్లు మంత్రిగా ఉన్నావ్‌ ఏం చేశావ్..
 
13. అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని భయపెట్ట డం మానుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రారు. వస్తామని భ్రమలు కల్పించి బతకాలనుకుంటున్నారేమో. ఉమా వళ్లు దగ్గర పెట్టుకో.. అధికారుల దగ్గరకో, మా పార్టీ ప్రతినిధుల దగ్గరకో వెళ్లి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా. నువ్వు వచ్చేటప్పుడు ఎక్కడకు వస్తావో చెప్పు... నేను అక్కడకు వస్తా. 
 
14- మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయిందంటూ  చంద్రబాబు నిన్న హైదరాబాద్‌లో కూర్చుని స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌లకు, డబ్బులు అప్పులగా ఇచ్చి వ్యభిచార కూపంలో దించడానికి మీరు అధికారంలో ఉండగానే మీ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు  ఆ పనులు చేశారు. 

ఆడపిల్లలు లేరుకాబట్టి, వాటన్నింటినీ బెజవాడలో ప్రోత్సహించావు. అప్పటి విజయవాడ సీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ను సెలవు మీద పంపించావు. చేతగాని, అసమర్థ  ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందావు, కాబట్టే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో మీకు 23 సీట్లు ఇవ్వడమే కాకుండా మంగళగిరిలో నీ కొడుకును కృష్ణానదిలో కలిపారు. 
 
15-చట్టపరంగా జరగనటువంటివి ఏ కార్యక్రమాలు అయినా వాటన్నింటిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు. మీరు రాష్ట్ర ప్రతిపక్షనేత అయితే ఉండేది మాత్రం హైదరాబాద్‌లో. అడ్రసు మాత్రం కరకట్టది పెట్టుకున్నారు. అలాగే  మాదక ద్రవ్యాలు అమ్మే పనికిమాలిన వ్యక్తి కూడా మాదక ద్రవ్యాలు ఎక్కడో అమ్ముతూ అడ్రస్‌ ఇక్కడది పెట్టుకున్నాడు. అతనికి, మీకు దగ్గర పోలికులు, లక్షణాలు ఉన్నాయి.
 
16- ఏబీఎన్‌, టీవీ5, ఈనాడు అందరూ కలిసి వేలాడినా కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఊడిన వెంట్రుక కూడా పీకలేరు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైయస్సార్‌ సీపీనే. పేదవాడి పార్టీ అంటే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, 31 లక్షల నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా కార్యక్రమం చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వమే. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను పైకి తీసుకు వచ్చి, వారి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి జగన్‌ గారు.
 
వైయస్సార్‌ కుమారుడు జగన్‌ మోహన్‌ రెడ్డిని  కోట్లాదిమంది ప్రజలు కోరుకుంటున్నారు. జగన్‌గారు బతికున్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోట్లాదిమంది ప్రజలు ప్రతిరోజు దేవుడిని కోరుకుంటున్నారు. మీ బోటి వాళ్ళు మట్టి చల్లినా, ఏంచేసినా ఆకాశం మీద ఉమ్ము వేస్తే అది మీమీదే పడుతుంది. మీరు కుళ్లి, కృశించి నశించి పోవడం తప్పించి, జగన్‌గారి పరపతిని, స్థాయిని, ఆలోచన విధానాన్ని అయిదు పైసలు కూడా తగ్గించలేదు. 
 
రాష్ట్రంలో వైయస్సార్‌ సీపీ జెండాని కానీ, జగన్‌ మోహన్‌ రెడ్డి గారి చిటికెన వేలు, గోరును కదిపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. ఆయనను పక్కరాష్ట్రంలో బతికే నలుగురు  ఏమీ చేయలేరు. మీరు అక్కడ నుంచే గంటలు గంటలు పడి ఏడవండి. జగన్‌ గారి పాలనలో ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. టీడీపీ ఎన్నికలు బహిష్కరించినా.. ఏం చేసినా ఒకటే ఫలితం.
 
17- టీడీపీ అధినాయకుడు నుంచి కింద ఉన్న నాయకుల వరకూ ఒకటే చెబుతున్నాం. జగన్‌ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే రోడ్డు మీద నిలబెట్టి ప్రజలే గుడ్డలూడదీసి బూతులు తిడతారు.
 
18-చంద్రబాబు ఎవరికి సవాల్‌ విసురుతున్నాడు. ఆయనకు అంత సీన్‌ ఉందా? కుప్పంలో చంద్రబాబు పోటీ చేసి గెలవగలడా..? ఓడిపోకపోతే నేను రాజకీయాలు వదులుకుంటాను  కుప్పంలో రాజీనామా చేసి గెలిస్తే బాగుంటుంది. మమ్మల్ని ఎందుకు రాజీనామాలు చేయమంటాడు. ఒకవేళ ఎన్నికలకు వెళితే నేను ఎన్నికలను బహిష్కరించాను.. అంటూ మళ్ళీ పారిపోతాడు. చంద్రబాబు ఛాలెంజ్‌ చేస్తే దాని వెనక ఎదో కుట్ర ఉంటుంది. మంచి రాజకీయ నాయకుడో, మరొక వ్యక్తో సవాల్‌ చేస్తే స్వీకరిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం