Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీల ప్రాణం తీసిన అతివేగం.. విహార యాత్రలో విషాదం

అతివేగం నలుగురు టెక్కీల ప్రాణం తీసింది. అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చింది. ఫలితంగా విహార యాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... టీసీఎస్‌ కంపెనీకి చెందిన కొందరు ఇంజనీర్లు వ

Webdunia
సోమవారం, 2 జులై 2018 (13:53 IST)
అతివేగం నలుగురు టెక్కీల ప్రాణం తీసింది. అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చింది. ఫలితంగా విహార యాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... టీసీఎస్‌ కంపెనీకి చెందిన కొందరు ఇంజనీర్లు విహారయాత్ర కోసం ఆదిలాబాద్‌ జిల్లా, నేరడిగొండ మండలం, కుంటాల జలపాతాన్ని సందర్శనార్థం వచ్చారు.
 
తిరుగు ప్రయాణంలో నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా టైరు పేలిపోవడంతో వాహనం డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొట్టి, రోడ్డుపక్కన పడింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న సాప్ట్‌వేర్‌ ఉద్యోగి దినేష్‌ (27), కుసుమ (28) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడడంతో వారిని హుటాహుటిన నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియాస్పత్రికి తరలించి చికిత్సలు జరిపారు. తీవ్రంగా గాయపడినవారిలో యుగేంధర్‌, శ్రీవిద్య, నవీన్‌, నిఖిత ఉన్నారు. వీరికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నిజామాబాద్‌కు తరలించారు. నిజామాబాద్‌లో చికిత్సపొందుతూ వీరిలో శ్రీవిద్య మృతిచెందింది. ఆ తర్వాత మరో ఇద్దరు టెక్కీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments