Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపు సరే... ఇంత మెజార్టీని ఊహించలేదు : తంగిరాల సౌమ్య

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (12:22 IST)
కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో తాను గెలుపొందుతానని ముందుగానే తెలుసని, కానీ ఇంత భారీ మెజార్టీని ఊహించలేదని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. తాను గెలుస్తానని తెలుసునని, మెజార్టీని మాత్రం ఊహించలేదన్నారు. తనను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. 
 
నందిగామ శాసన సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు పైన 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెల్సిందే. స్థానిక కేవీఆర్ కళాశాలలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. టీడీపీ అభ్యర్థి సౌమ్యకు 99,748, కాంగ్రెస్ అభ్యర్థికి 24,921, స్వతంత్ర అభ్యర్థులు పుల్లయ్య 941, పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. నోటాకు 1178 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన తంగిరాల సౌమ్యకు ఎన్నిక ధ్రవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి రజనీకాంతా రావు అందజేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments