Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమాంతం ప‌డిపోయిన ట‌మాటా ధ‌ర‌... రైత‌న్న‌కు శరాఘాతం!

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (14:21 IST)
అమ్మో ట‌మోటా ధ‌ర‌లు అన్నారు నిన్న‌టి వ‌ర‌కు వినియోగ‌దారులు... ఇపుడు అదే మాట‌ను రైతులు అంటున్నారు. అవును టమోటా రైతులకు ధరల శరాఘాతం త‌గులుతోంది. నిన్న మొన్నటి వరకు రూ. 70 నుంచి 80 పలికిన టమాటా ధర నేడు స్థానిక రైతుల టమోటా చేతికి వచ్చే సరికి అమాంతంగా సగాన్నికి పడిపోయింది. 
 
 
రాష్ట్రంలో టమోటా పంట అధికంగా చిత్తూరు జిల్లాలో పండుతుంది. అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఈ పంట భారీగానే సాగు అవుతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా వాతావరణ పరిస్థితుల‌కు త‌ల్లకిందులు అవుతోంది... నందిగామ నియోజకవర్గంలోని టమోటా పడించే రైతుల పరిస్థితి. పంట చేతికి వచ్చే సరికి రేట్లు లేకపోవడంతో నష్టాల‌పాల‌య్యారు. ఈ ఎడాది సైతం మరో సారి నష్టల ఊబిలో కూరుకు పోయే పరిస్థితి ఏర్పడింది. 
 
 
లోకల్ టమోటా పంట భారీగానే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి వేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో వేసిన టమోటా పంట అధికంగా కురిసిన వర్షాలకు దెబ్బతింది. ఇక లోకల్ టమోటాకు ఈ సారైనా గిట్టుబాటు ధర వస్తుందని రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారిగా పెరిగిన టమోటా ధరలను నియంత్రించడానికి ఇతర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి చేసుకుని ధరలను నియంత్రించడానికి కృషి చేసింది. ఈ నేపథ్యంలో లోకల్ టమోటా పంట రైతుల చేతికి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి చేసుకునే పరిస్థితిలోనే ఉండటంతో స్థానిక రైతుల టమోటా పంటకు సరి అయిన ధర పలికే పరిస్థితి లేకపోగా, ప్రస్తుతం నడుస్తున్న రేట్లు నిలబడే పరిస్థితి లేదని టమోటా రైతులు వాపోతున్నారు. 
 
 
పండించిన రైతులు నష్టపోతుంటే, ఇతర ప్రాంతాల నుంచి టమోటా దిగుమతి చేసుకుని రైతు బజార్ లలో కమీషన్ పద్దతిపై వ్యాపారం చేసే కమీషన్ దారులు కోట్లకు పడగలెతున్నారు. నందిగామ రైతు బజార్ లో ఇదే పద్దతి కొన్న సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందిగామ మార్కెట్లో రోజుకు సుమారు 300 టమోటా ట్రేలు అమ్మకం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రేకు రూ 50 కమీషన్ పోందుతున్నారు. అంటే రోజుకు రూ. 15000/ వరకు లాభం పోందుతున్నారు. అంటే సుమారు నెలకు రూ. నాలుగున్నర లక్షల ఆదాయం వస్తుంది. 
 
 
ఈ టమోటా పంట ఇతర ప్రాంతాల నుంచి సుమారు 6 నెలలు పాటు ఇదే విధంగా దిగుమతి చేసుకుని అమ్మకాలు సాగవలసి ఉంటుంది. ఆంటే 6 నెలలకు ఒక్కోక్క నెలకు నాలుగున్నర లక్షల ఆదాయం మొత్తం కలిపి దాదాపుగా రూ. సుమారు 27 లక్షల రూపాయలు కమీషన్ దారులు లాభాలు పోందుతుండగా పంట పండిస్తున్న ఈ ప్రాంతం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ లలో దళారుల ప్రమేయం పై చర్యలు తీసుకొని, స్థానిక రైతులు పండించే టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రాంత  టమోటా రైతులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments