Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ, ఏపీ సహా 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:36 IST)
విద్యా రంగంపై కేంద్రం పెత్తనం ఏంటి?  దీనిపై నిల‌దీద్దాం అంటూ త‌మిళ‌నాడు యువ ముఖ్య‌మంత్రి స్టాలిన్ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు రాశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం 12 రాష్ట్రాల సీఎంలకు రాసిన తన లేఖలో విద్యా వ్య‌వ‌స్థ‌పై ప్ర‌స్తావించారు. 
 
 
విద్యా రంగంలో రాష్ట్రాల హక్కులపై పోరాడుదాం అని పిలుపునిచ్చారు. విద్యా రంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని పేర్కొన్నారు. కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని వివరించారు. తన లేఖలో ప్రధానంగా నీట్ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖతో పాటు పంపారు. అంతేకాదు, ఏకే రాజన్ కమిటీ సిఫారసు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జత చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments