Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశానికి కాలసర్ప దోషం ఉంది: శారద పీఠాధిపతి

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (14:45 IST)
కరోనా (కోవిడ్-19) మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో బుధవారం నుంచి ప్రత్యేక హోమాలు ప్రారంభం అయ్యాయి. స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. పీఠంలో నేటి నుంచి ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా లోక కల్యాణం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు ధన్వంతరి హోమం ప్రారంభమైంది. ముందు జాగ్రత్త చర్యగా 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయ దర్శనానికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే అన్ని ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి.
 
పాప గ్రహాల శక్తి పుంజుకుంది..
ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అమృత పాశు పత సహిత, విష జ్వర హర యాగాన్ని నేటి నుండి నిర్వహిస్తున్నామన్నారు. వేద మంత్రాలు, బీజాక్షరాల సంపుటి చేసి, ఈ యాగాన్ని సామాజిక స్పృహతో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని పేర్కొన్నారు. రాహువు దృష్టి గ్రహాల మీద పడటం వల్ల ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. 
 
'శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీద ప్రభావం ఉంది. ఏప్రిల్ 2 నుండి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉంది. వీటన్నింటి వల్ల ఈ అమృత పాశు పత సహిత విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది ఈ క్రతువులో పాల్గొంటున్నారు. యాగంలో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు, గోమయంతో తయారైన పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నాం. ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుంది' అని స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments