మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుంది : స్వరూపానందేంద్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వెలుగు కిరణం ప్రధాని మోడీ అన్నారు.
దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ఒక పీఠాధిపతిని ముఖ్యమంత్రిని చేయడం అభినందనీయమన్నారు. అదేసమయంలో అయోధ్యలో రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని తెలిపారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఇరు వర్గాలు కూర్చొని చర్చించి ఓ మంచి నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.