Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణం: డాక్టర్ జవహర్ రెడ్డి

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (19:35 IST)
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవ నిర్వహణ కోసం రూ. 17 కోట్లతో నిర్మించిన కళ్యాణ వేదికను టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం పరిశీలించారు.  అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణం కమనీయంగా నిర్వహించడానికి కళ్యాణ వేదిక నిర్మించినట్లు చెప్పారు. కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది స్వామి వారి కళ్యాణం ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించామన్నారు.

వచ్చే ఏడాది శ్రీ రామనవమి సందర్బంగా తొలిసారి ఈ వేదిక మీద స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. స్వామివారి దయతో అప్పటికి కోవిడ్ పూర్తిగా నశించిపోగలదనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

ఎస్ఈ 1  జగదీశ్వరరెడ్డి, ఒంటిమిట్ట డిప్యూటి ఈఓ లోకనాథం, డిప్యూటీ ఈఈ హర్షవర్ధన్, ఏఈ దేవరాజు ఈవో వెంట ఉన్నారు.  ఇదిలా ఉండగా కార్తీక సోమవారం సందర్బంగా ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి వై ఎస్ ఆర్ జిల్లా కమలాపురం మండలం టి.చదిపిరాళ్లలోని శ్రీ పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.   

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments