Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలి : పరిపూర్ణానంద స్వామి

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:32 IST)
దేశంలోని పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం హిందువులు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు. అదేసమయంలో దేశంలో హిందూ పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఈ వ్యాఖ్యలను జగిత్యాలలో చెబుతున్నానని అంటే జగమంతా చెప్పినట్టేనని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో సోమవారం జరిగిన వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో హిందూ పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువులుగా జీవించేవారికి, హిందువులు కాకపోయినప్పటికీ హిందువులను, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలని కోరారు. 
 
జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని అందుకనే ఇక్కడే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ అంశం దేశ వ్యాప్తంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క దానికి ఆధారమైన ఆధార్ కార్డులను ఎవరికిపడితే వారికి ఇవ్వరాదని ఆయన కేంద్రాన్ని కోరారు. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments