Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:44 IST)
దేశంలో కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. అనగా ఆదివారం (11-4-2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు.
 
కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విష‌యం విదిత‌మే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో  సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది.
 
ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తదుపరి టోకెన్లు ఎప్పుడు జారీ చేసేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments