Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూర్ టు ఏపీ బస్ సర్వీస్ ?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (21:15 IST)
బెంగళూరుతో పాటూ కర్ణాటక నుంచి బస్సుల్లో రావాలనుకునేవారికి బ్యాడ్‌న్యూస్. ఏపీ-కర్ణాటక మధ్య నడిచే అంతర్రాష్ట్ర  బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి సర్వీసులు ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.
 
ఈ నెల 23 వరకు పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. అత్యవసర పనుల ఉన్నవారికి మాత్రమే రోడ్లపైకి అనుమతి ఇస్తారు. లాక్‌డౌన్ కారణంతో బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏపీ వైపు సర్వీసులను ఆపేస్తున్నట్లు ఇప్పటికే కర్ణాటక ప్రకటించింది. ఇక ఏపీ నుంచి వచ్చే బస్సులను అనుమతించే విషయమై సోమవారం సాయంత్రంలోపు దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
 
ప్రస్తుతానికి బస్సులు తిప్పుతున్నా.. దీనిపై కర్ణాటక అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరు నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
 
కర్ణాటక కూడా ఏపీకి బస్సులు నిలిపివేసింది. దీంతో ఏపీ అధికారులు కూడా ఆలోచనలో పడ్డారు. పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సర్వీసులు రద్దుకే మొగ్గు చూపితే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్ల డబ్బు వాపసు చెల్లించనున్నారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments