Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇప్ప‌టికిపుడు ఎన్నిక‌లు జ‌రిగితే...? 120 సీట్ల‌తో జ‌గ‌నే సీఎం... జనసేన పరిస్థితి ఏంటి?

విజ‌య‌వాడ‌: ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే.. రాష్ట్ర ప‌జ‌లు ఎటువైపు మొగ్గుతారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఈ విషయమై అధికార తెలుగుదేశం పార్టీ ఓ రహస్య సర్వే చేయించిందట. అందులో టీడీపీకి షాకిచ్చేలా ఫలితాలు వచ్చాయట. ఇప్పటికిప్పుడే ఎన్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:33 IST)
విజ‌య‌వాడ‌: ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే.. రాష్ట్ర ప‌జ‌లు ఎటువైపు మొగ్గుతారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఈ విషయమై అధికార తెలుగుదేశం పార్టీ ఓ రహస్య సర్వే చేయించిందట. అందులో టీడీపీకి షాకిచ్చేలా ఫలితాలు వచ్చాయట. ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ పార్టీకి చావుదెబ్బ ఖాయమని తేలిందట. 120కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంద‌ని, ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని తేలింద‌ట. అధికార టీడీపీకి 50కి అటు ఇటుగా అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయని తేలిందట. ఈ ఫలితాల గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేజార‌వుతున్నారని చెప్పుకుంటున్నారు.
 
మంత్రులకు, టీడీపీ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకుని, పనితీరు మెరుగుపడాలని, లేకపోతే క‌ష్ట‌మ‌ని హెచ్చరించారట. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటిక్ టెలి కాలింగ్ ద్వారా టీడీపీ వినూత్న స‌ర్వే చేయించింది. ఇప్ప‌టిక‌పుడు ఎన్నిక‌లు వ‌స్తే... మీరెవ‌రికి ఓటు వేస్తారు... మీ ఆప్ష‌న్ టీడీపీ అయితే, ఒక‌టి నొక్కండి... కాంగ్రెస్ అయితే 2 నొక్కండి, వైసీపీ అయితే మూడు నొక్కండి... బీజేపీ అయితే నాలుగు నొక్కండి అంటూ టెలికాలింగ్ ద్వారా వేల మందిని స‌ర్వే చేసినట్లు సమాచారం. ఈ సర్వే విషయాన్ని టీడీపీ నేతలను ప్ర‌శ్నిస్తే, అబ్బే అలాంటి సర్వేను మేం చేపట్టలేద‌ని కొట్టిపారేస్తున్నారు. 
 
కానీ, ప్రత్యేక హోదా రాకపోవడం, ప‌రిశ్ర‌మ‌లు రాక‌... విద్యా, ఊపాధి అవ‌కాశాలు లేక, ముఖ్యమైన హామీలు నెర‌వేర‌క ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త‌తో ఉన్న మాటను ప‌లువురు అధికార పార్టీ నాయకులే అంగీక‌రిస్తున్నారు. వ‌చ్చే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ప్ర‌భావం క‌నిపిస్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. జనం పల్స్ తెలుసుకుని, తమ పార్టీ నాయకులను అప్రమత్తం చేసే చర్యల్లో భాగంగానే సీఎం చంద్రబాబు ఈ సర్వే చేయించి ఉంటార‌ని భావిస్తున్నారు. కాగా జనసేన గురించి మాత్రం వారు సర్వేలో ఎలాంటి ప్రశ్నలు వేయలేదట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments