Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా క్షమాపణ లేఖ ఇచ్చారా? ఏదీ ఇక్కడ ఇవ్వగలుగుతారా? సుప్రీంకోర్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నం

Webdunia
గురువారం, 6 జులై 2017 (15:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నందున ఈ కేసు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టీకరించింది. 
 
కాగా ఎమ్మెల్యే అసెంబ్లీ ఘటనపై క్షమాపణలు చెపుతూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని సుప్రీంకోర్టుకు రోజా తరపు న్యాయవాది విన్నవించారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది... తమకు ఆ లేఖ అందలేదని వెల్లడించారు. దీనితో సుప్రీంకోర్టు... ఏదీ ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా అని ప్రశ్నించింది. 
 
దీనితో సుప్రీంకోర్టు సమక్షంలో రోజా క్షమాపణలు తెలుపుతూ రాసిన లేఖను ప్రభుత్వ తరపు న్యాయవాదికి అందించారు. అనంతరం ఆ లేఖను సంబంధిత అధికారులకు పంపాలని ఆదేశించింది. మరోవైపు కేసును హైకోర్టు విచారించి, తీర్పు వెల్లడించిన తర్వాత ఇక్కడకు రావచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం