వైకాపా చీఫ్ జగన్ బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంలో కీలక పరిణామం!!

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (12:47 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్‌పై విచారణను డిసెంబరు 2వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆ రోజున ఈ కేసును లిస్ట్ చేయాలంటూ రిజిస్ట్రీని అదేశించింది. 
 
జగన్‌ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం ముందు విచారణకు రాగా వాటిని మరో బెంచ్‌కు మార్చింది. 
 
జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్‌ నుంచి మార్చాలని తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది. సీజేఐ ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ సభ్యుడిగా ఉన్నారు. 
 
విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి అని జగన్‌ తరపు న్యాయవాది రంజిత్‌ కుమార్‌ తెలిపారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.
 
ఈ క్రమంలో జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ 'నాట్‌ బిఫోర్‌ మీ' అనడంతో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబరు 2వ తేదీన విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments